![]() |
![]() |

‘జబర్దస్త్’ లో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు. ఈ షో ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేసే ఇతని లైఫ్ లో చాలా కష్టాలున్నాయి. కొన్నేళ్ల నుంచి పంచ్ ప్రసాద్ కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాడు. రీసెంట్ గా ఒక షూట్ కి వెళ్ళొచ్చాక అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు ప్రసాద్ ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
తన హెల్త్ కి సంబంధించి లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ తో మరో వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం మెరుగయ్యిందని చెప్పాడు. కర్ర కానీ, మనిషి హెల్ప్ కానీ తీసుకుని నడవగలుతున్నట్లుగా చూపించాడు ఈ వీడియోలో. ఇక తాను నాలుగు రోజుల నుంచి కూర్చుని సైలెన్స్ ఎక్కించుకుంటున్నాడు.
ఇలాగే మరో నాలుగు రోజులు కూడా చేయాల్సి ఉంటుందని నూకరాజు చెప్పాడు. ఇక తాను జాయిన్ ఐన హాస్పిటల్ లో స్కానింగ్ కూడా చేశారు. వారం గడిస్తే గాని ప్రసాద్ నడవగలిగే విషయం చెబుతామని డాక్టర్స్ వివరించారు. ప్రసాద్ పూర్తిగా రికవరీ అయ్యాక మరో వీడియో చేసి పెడతానని నూకరాజు చెప్పాడు. ఇక తన హెల్త్ బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పంచ్ ప్రసాద్ తన ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు చెప్పాడు.
![]() |
![]() |